రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 11:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను మండల తహసిల్దార్ రజినీకుమారి మంగళవారం రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. అదేవిధంగా అక్కన్నపేట గ్రామంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్వరలో పూర్తిచేయాలని ఆమె సూచించారు.అక్కన్నపేట గ్రామంలో బడిబాట కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాల పైబడిన బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని అందుకు బడిడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.