Reporter -Silver Rajesh Medak.
తేదీ 10-6-2024
మెదక్ జిల్లా
బడిబాట విజయవంతానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లె నిద్ర
నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలం లో ఉన్న జక్కపల్లి గ్రామంలో పల్లె నిద్ర చేయనున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
చదువుకోవడం వల్ల మానసిక పరిపక్వత సాధించవచ్చు .
చదువు చాలా ఉన్నతమైనది
చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చు.
మెదక్ జిల్లా బడిబాట విజయవంతానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమం.
జిల్లాలో ఉన్న ప్రత్యేక అధికారులకు పిలుపు
మహిళా ఉద్యోగులకు వెసులుబాటు .
బడిడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి.
ప్రతి ఒక్క అధికారి 100 ఇండ్ల సర్వే చేయాలి .
పల్లెనిద్ర కార్యక్రమానికి రెడీ అంటున్న జిల్లా యంత్రాంగం.
మెదక్ జిల్లా కలెక్టర్ బడిబాట కార్యక్రమం విజయవంతానికి ఈరోజు రాత్రి నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలో ఉన్న జక్కపల్లి గ్రామంలో పల్లెనిద్ర చేస్తున్న కలెక్టర్ రాహుల్ రాజ్.
జిల్లాలో ఉన్న గ్రామ ,మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఆయా గ్రామా, మండల జిల్లా స్థాయిల్లో పల్లెనిద్ర చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో విద్య కోసం చైతన్యం చేసి , బడిడు పిల్లలందరి బడిలో చేర్పించాలని, ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ప్రత్యేక అధికారులు గ్రామంలో ఉన్న గడపగడపకు తిరిగి విద్యా గొప్పతనాన్ని బోధిస్తూనే విద్యార్థులను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.
ఆయా గ్రామ, మండల ,అధికారులు కచ్చితంగా 100 ఇండ్లను సర్వే చేసి బడిడు పిల్లలను బడికి పంపించేలా విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పించాలన్నారు.
పల్లె నిద్రలో భాగంగా అధికారులు సోమవారం రోజు రాత్రి పల్లెకు చేరుకొని నిద్ర చేసి, మంగళవారం పొద్దున గ్రామంలో ఉన్న గడపగడపకు తిరుగుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు చదువు పై అవగాహన కల్పిస్తారన్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.