మార్నింగ్ వాక్ ఫర్ పూర్ పీపుల్
స్టూడియో10టీవీ టెక్కలి ప్రతినిది – శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి లో నిరుపేదలకు చేయూత నివ్వడానికి స్థాపించబడ్డ అభయం యువజన సేవా సంఘం వారు నేడు మార్నింగ్ వాక్ ఫర్ పూర్ పీపుల్ కార్యక్రమం ద్వారా టెక్కలి నియోజకవర్గం లో ఆసరా లేని వృద్దులకు , దివ్యాంగులకు, వితంతువులకు, 25 కేజీల రైస్, 20 రకాల నిత్యవసర వస్తువులు సుమారు 10 కుటుంబాలకు పంపిణీ చేసినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాస రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధి పొందిన అభాగ్యుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. గువ్వాడ అరుణ, పూతిక రాజేశ్వరి, మెట్ట కస్తూరి, మజుందర్ నాగమణి, కడియాల సిమ్మలమ్మ, కొల్లి అప్పలమ్మ , జోగి దమయంతి, ప్రసన్నకుమార్ మహాపాత్రో , బర్రు మల్లమ్మ , అద్దాల పార్వతి. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మార్నింగ్ వాక్ అనేది ఆరోగ్యం కొరకే కాదు అభాగ్యుల ఆకలి తీర్చడం కొరకు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాస రావు తో పాటు సంఘ సభ్యులు యన్ సింహాచలం, మున్న, ధర్మవరపు పూర్ణాచారి, అద్దాల వీరభద్రాచారి, ఉంగరాల గోవింద్, దున్న శ్రీను, యమ్ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు