అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి.

Reporter -Silver Rajesh Medak.

తేదీ 10-6-2024
మెదక్ జిల్లా

అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి.

నిబంధన ప్రకారం ఇసుక రవాణా చేయాలి

ఇసుక వ్యాపారులు ఉపేక్షించవద్దు. ఇసుక రవాణాలో అమాయకులను బలిచేయొద్దు. మొక్కలు నాటాలి ,అడవులను సంరక్షించాలి .శాంతి భద్రతలను పరిరక్షించాలి , ట్రాఫిక్ సమస్యలు రావద్దు
ఎరువులు విత్తనాల కొరత లేదు .ఎరువు విత్తనాల కొరత ఉంటే నన్ను డైరెక్టుగా సంప్రదించవచ్చు .
మహిళా సాధికారతే ముఖ్యం

పట్టణాల్లో ఫాగింగ్ నిరంతరంగా జరగాలి .
చెరువుల సుందరికరణ జరిపి
చెరువులను ఆహ్లాదంగా తయారు చేయాలి

మెదక్ పట్టణంలో ఆదాయాన్ని పెంచాం .

మత్తుమందు, గంజాయి, మాదకద్రవ్యాలపై నిఘా పెంచాలి

పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనo అందించలి.

గొర్రెల కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయాలి.

నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చిన రాత్రి పగలు అనకుండా అందుబాటులో ఉంటా.

స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం అటవీ,పోలీసు,వ్యవసాయ,హార్టికల్ ర్, కో-ఆపరేటివ్,మెప్మ,ఎస్సీ ఎస్టీ అభివృద్ది,మహిళ అభివృద్ది,శిశు సంక్షేమ ,మత్స్యశాఖ ,మున్సిపల్ మైన్స్,సివిల్ సప్లై,
ఎక్సైజ్ ,విద్య,విద్యుత్, పారిశ్రామిక, కాలుష్యం, లేబర్, పంచాయతీ, ఆర్ అండ్ బి, డి ఆర్ డి ఓ ,వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు తో కలసి ఎంఎల్ఏ డా:మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా ఎంఎల్ఏ డా మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వంలో అధికారులు సమన్వయం తో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అదచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి , రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందించడం లో మొదటి స్థానం లో ఉంచాలన్నారు.

అన్ని శాఖల అధికారుల పని తీరును అడిగి తెలుసుకున్నారు.
అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతూ వానాకాలం మొక్కలు నాటడం లక్ష్యాన్ని నెరవేర్చారన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని, మెదక్ నియోజకవర్గాన్ని పూల ,పండ్ల. ఔషధ మొక్కలతో ఆహ్లాదంగా తయారు చేయాలన్నారు.
పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడుతూ శాంతిభద్రను పరిరక్షించాలని, ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని అక్రమ ఇసుక తరలింపు పై కఠినంగా వ్యవహరించాలన్నారు.
ఇసుక వ్యాపారం చేసే వారి మీద చర్యలు తీసుకోవాలి కానీ పేదవారు సాధారణ వ్యక్తులు గృహ నిర్మాణం కోసం ఇసుక తరలించే వారి మీద కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించే వారి పైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండాలని, ఎరువులు విత్తనాల కొరత రానీయ వద్దని, విత్తనాల కొరత ఎరువుల కొరత ఉంటే అధికారులు నన్ను డైరెక్టుగా మాట్లాడవచ్చు అన్నారు. నియోజకవర్గ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
హార్టికల్చర్ శాఖపై మాట్లాడుతూ హార్టికల్చర్ శాఖను అభివృద్ధి పరచాలని జిల్లా రైతులకు హార్టికల్చర్ లో ఉన్నటువంటి మెలకువలు తెలపాలని, వ్యవసాయంలో ఆధునికత జోడించి అదనపు ఆదాయాలు ఏ విధంగా సంపాదించాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
సహకార సంఘాలపై మాట్లాడుతూ సహకార సంఘాలు బలోపేతం కావాలని సహకార సంఘాలు ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా రైతుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు.
మెప్మా శాఖ పై మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం సమున్నత స్థానం కల్పిస్తుందని, మహిళా సాధికారత తమ ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సంఘాలకు రుణాలు అందించడంలో శాఖ తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి శాఖ పై మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉపాధి అవకాశాలు లభించాలని , ఎస్సీ ఎస్టీల అభివృద్ధి తమ ఎజెండా అని, ఎస్సీ ఎస్టీలకు సమున్నత స్థానం కల్పించబడుతుందని తెలిపారు.
మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ పై మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు పౌష్టికాహారం అందించాలని పిల్లల మానసిక స్థితిని మెరుగుపరచడం కోసం అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
మత్స్య శాఖ పై మాట్లాడుతూ మత్స్య శాఖ బలోపేతం చేయాలని, దీనిపై ఆధారపడినటువంటి కుటుంబాలకు అనేక రకాల కార్యక్రమాలు అందించాలన్నారు.
మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడుతూ పట్టణంలో త్రాగునీరు సమస్య రావద్దని అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎలాంటి సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఫాగును ఎక్కువసార్లు కొట్టాలని పట్టణంలో దోమల బెడద రాకుండా నిర్మూలన చర్యలు చేపట్టాలని మున్సిపల్ పరిధిలో ఉన్న చెరువుల సుందరీకరణ చేయాలని, సుందరీకరణ చేసిన చెరువుల్లో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని, కోతులు, కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షించాలని కోతులకు, కుక్కలకు హాని జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేయాలని ఇసుక వ్యాపారులని ఉపేక్షించొద్దని పేద మధ్య తరగతి కుటుంబాలు సొంత గృహ నిర్మాణాల కోసం ఇసుక రవాణాను చేస్తే సరైన దరఖాస్తు చూపిస్తే కేసులు చేయొద్దన్నారు. సివిల్ సప్లై అధికారులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
ఎక్సైజ్ అధికారులతో మాట్లాడుతూ గంజాయి మాదకద్రవ్యాలు మత్తు పదార్థాలపై గట్టి నిఘపెంచాలని , వాటిని సప్లై చేసే వారిని కఠినంగా శిక్షించాలి అన్నారు.
విద్యాశాఖ పై మాట్లాడుతూ నియోజకవర్గం లోని పాఠశాలలో ఏకరూప దుస్తులు పుస్తకాలు నాయనమైన భోజనం అందించి ఈ సంవత్సరం మంచి ఫలితాల పై దృష్టి సారించాలన్నారు.
కాలుష్య నియంత్రణ అధికారులతో మాట్లాడుతూ కాలుష్య నిర్మూలించాలని ప్రజలు కాలుష్యం బారిన పడకుండా చూడాలన్నారు.
లేబర్ శాఖ అధికారులతో మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని ఎక్కడ చిన్న పిల్లలు పనిచేసిన ఉపేక్షించొద్దని బడిడు పిల్లలందరూ పాఠశాలలో ఉండాలని తెలిపారు.
జిల్లా పంచాయతీ శాఖ అధికారులతో మాట్లాడుతూ గ్రామాల్లో ఏ సమస్య రాకుండా చూడాలని త్రాగునీరు ,పరిశుభ్రం దోమల నివారణ , చేయాలని పల్లెలను ఆదర్శవంతంగా తయారు చేయాలన్నారు.
ఇతర శాఖ అధికారులతో మాట్లాడుతూ గొర్రెలు కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి వాపస్ చేయాలన్నారు.
మిషన్ భగీరథ నీరు గడపగడపకు అందించాలన్నారు .
అధికారులు, ప్రజలు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న రాత్రి పగలు లేకుండా అందుబాటులో ఉంటానని కలిసి పనిచేసి ఆదర్శ నియోజకవర్గంగా మెదక్ ను తయారు చేయాలని అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
అదరపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేస్తూ జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం అధికారులు పనిచేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య ,డిఆర్డిఏ శ్రీనివాసరావు, మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ,జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!