రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 10:- రక్త,అవయవదానంల ఆవశ్యకత, ప్రాముఖ్యత లను మారుమూల గ్రామీణ ప్రాంతాలలో,పట్టణ ప్రాంతాలలో గోడపత్రికల,సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించడానికి విశేష కృషి చేసి హైద్రాబాద్,మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట సంగారెడ్డి ప్రాంతాలలో రక్తదాన శిబిరం ల నిర్వహణ కు కృషి, అవయవ దానం పై అవగాహన గురించి వివిధ ప్రాంతాలలో కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి సేవలు గుర్తించి లయన్స్ జిల్లా 320 -డి గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి నిన్న సాయంత్రం జరిగిన వైటల్ అవార్డుల ప్రధానోత్సవం లో ఉత్తమ జిల్లా చైర్మన్గా అవార్డును మరియు మెడల్ ను ప్రధానం చేయడం జరిగింది. అంతర్జాతీయంగా నూట ఏడూ సంవత్సరాలుగా లయన్స్ సభ్యులు పలు రంగాలలో సేవలందిస్తున్నారని ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పట్టిహిల్ “చేంజ్ ద వరల్డ్ “అనే నినాదంతో లయన్స్ సంస్థ ద్వారా అన్ని రకాల సేవలతో పాటు, సమస్త ను బలోపేతం చేయడానికి సభ్యుల చేరికకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని సమస్థ లో నూతన సభ్యుల చేరిక ద్వారా బలోపేతం చేసి అత్యున్నత సేవలను అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా లైన్స్ గవర్నర్ లక్ష్మి అన్నారు. లయన్స్ క్లబ్ రామాయంపేటలో చార్టర్ సభ్యుడిగా చేరి, గత 34 సంవత్సరాలుగా ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అవయవ దాన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి ఆదివారం సాయంత్రం అమృత గార్డెన్స్ నిజామాబాద్ లో వివిధ జిల్లాల నుండి వచ్చిన జిల్లాల నుండి వచ్చిన లయన్స్ సమక్షంలో రాజశేఖర్ రెడ్డి గత మూడు దశాబ్దాలకు పైగా చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి సంవత్సరము లయన్స్ జిల్లా క్యాబినెట్లో సభ్యుడిగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు లయన్స్ లీడర్లు మాజీ గవర్నర్లు లైన్ బి.వి. బన్సల్,లయన్ చిట్టి ప్రకాష్ రావు, లైన్ జి.ఆర్. సూర్య రాజ్,లయన్ ఓబుల్ రెడ్డి, లయన్ వీ.టి. రాజ్ కుమార్,డి. పెంటయ్య, లైన్ వీరేశం లయన్ శ్యాం కుమార్ జిల్లా సలహాదారులు లయన్ బసవేశ్వర రావు లు అభినందించడం జరిగింది.ఈ అవార్డుల ప్రధానోత్సవం లో 320-డి లయన్స్ లీడర్లు నగేష్ పంపాటి, లయన్ అమర్నాథ్ రావు, లయన్ ఎం.విజయలక్ష్మి, లయన్ టి పద్మావతి, లయన్ ఎం నాగరాజు,లయన్ నరసింహారాజు మరియు లయన్ మర్రి ప్రవీన్ లయన్ సూర్యనారాయణ, కోటిరెడ్డి, అమరేందర్ రెడ్డిలు పాల్గొని రాజశేఖర్ రెడ్డి సేవలను అభినందించారు. ఉత్తమ సేవలకు లయన్స్ క్లబ్ రామాయంపేటకు పలు అవార్డులు ఆదివారం సాయంత్రం అమృత గార్డెన్స్ నిజామాబాదులో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం లో ఈ సంవత్సరం అత్యుత్తమ సేవలకు గాను స్థానిక రామాయంపేట క్లబ్ కు పర్యావరణం, డాక్టర్ల సన్మానం, అన్న ప్రసాద వితరణ, స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందించినందుల గాను అధ్యక్షులు లయన్ దేమే యాదగిరి, జిల్లా చైర్మన్ లయన్ టీ.శేషాచారి లు క్లబ్ అవార్డులను పొంది పాల్గొన్నారు.