Reporter -Silver Rajesh Medak.
తేదీ :07.06.2024
మెదక్ జిల్లా
మిషన్ భగీరథ కనెక్షన్ల కోసం ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ రాహుల్ రాజ్ .
*ఇంటింటి సర్వేపై సమీక్ష సమావేశం.
మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ల పై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లాకలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం నిర్వహించిన వీడియో సమావేశం ద్వారా ఇచ్చిన ఆదేశాలు మేరకు , జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనల మేరకు, మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ల ఇంటింటి సర్వే కార్యక్రమంపై మెదక్, నర్సాపూర్ నియోజకవర్గం పనిచేసే ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీ లు అధికారులతో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
మిషన్ భగీరథ కనెక్షన్లు ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు పెరగడంతో, తాగునీటి అవసరాలు అనుగుణంగా ఏర్పాటు కోసం పది రోజులపాటు సర్వే నిర్వహించాలన్నారు.
మంచినీటి కనెక్షన్లు కుటుంబ సభ్యుల వివరాలు, నీటి అవసరాలు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలన్నారు . గ్రామాలలో 400 కన్నా తక్కువ కనెక్షన్లు ఉన్న పంచాయతీలలో పంచాయతీ సెక్రటరీలు సర్వే చేయాలన్నారు. 400 కన్నా ఎక్కువ కనెక్షన్లు ఉంటే, పంచాయతీ సెక్రెటరీ తో పాటు, అంగన్వాడి టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల తో సర్వే నిర్వహించాలన్నారు.
పెరిగిన కుటుంబాలకు అనుగుణంగా కావలసిన నీటి అవసరాలు గుర్తించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తయారుచేసిన ప్రత్యేక యాప్ పనితీరుపై జిల్లా నుండి నలుగురు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. సర్వే విధానం గురించి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య ,జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, మిషన్ భగీరథ ఈ ఈ సంపత్ , టీ వో టీ లు సంబంధిత అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.