- హుస్నాబాద్,పెర్కపల్లి హుజురాబాద్ మీదుగా ఆర్టీసీ సేవలు ప్రారంభం..
- హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రజలు..
సైదాపూర్:హుస్నాబాద్ నుండి సర్వాయిపేట,పెరుకపల్లె తదితర గ్రామాల మీదుగా హుజురాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు సేవలను ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్, హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు బస్సు సౌకర్యం కల్పించగా ముత్యాల మల్లేష్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. దశాబ్దాల కాలంగా బస్సు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ఆర్టిసి అధికారులకు బస్సు వెయ్యాలని ఆదేశించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తుందని, మహిళలు బస్సుల్లో ప్రయాణించి సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.ఆర్టీసీ అధికారులను, సిబ్బందికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ముత్యాల మల్లేష్ యాదవ్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్టిసి బస్సులో పెరికపల్లి నుండి హుస్నాబాద్ వరకు కాంగ్రెస్ నాయకులు ప్రయాణం చేసి ప్రయాణికుల్లో జోష్ నింపారు..తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆయా గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకురాలు,ప్రముఖ సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి, హుస్నాబాద్ మాజీసర్పంచ్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాశవేణి రవీందర్, హుస్నాబాద్ కౌన్సిలర్ భూక్య సరోజన, న్యాయవాది చిత్తారి రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అక్కు శ్రీనివాస్, హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు,హుజరాబాద్ ఎస్టిఐ మురళి, కంట్రోలర్ దయాల్ సింగ్, మండల కొమురయ్య, కానుగంటి బిక్షపతి, ఎండి సత్తార్, పోతరాజు ఈశ్వరయ్య, చిరంశెట్టి శ్రీనివాస్, పోతరాజు శంకరయ్య, వెంకటయ్య, తిప్పని కనకయ్య, చిన్నోళ్ళ శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.