Reporter -Silver Rajesh Medak.Date-03/06/2024.ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలను మెదక్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.సమస్యలు:- *వర్షాకాలం సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచగలరని కోరుకుంటున్నాము **గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల ఆ రైతుల యొక్క పంట అతివృష్టి గాని అనావృష్టి వల్ల గాని నష్టపోతే నష్టపరిహారం రానందున రైతులు చాలా నష్టపోయారు మరి ఈ ప్రభుత్వమైనా ప్రధానమంత్రి ఫసల్ బీమా (పంటల బీమా యోజన) యువజనను తక్షణమే అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము**అదేవిధంగా శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల రూపాయల లోపం వ్యవసాయ య రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ హామీని నెరవేర్చలేకపోయిందివెంటనే రైతులకు రుణమాఫీ చేయకపోతే ధర్నాలు రాస్తారోకలు చేస్తామని బిజెపి మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ గారు హెచ్చరించడం జరిగింది*ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు మరియు మెదక్ టౌన్ ప్రెసిడెంట్ నాని ప్రసాద్ గారు, మెదక్ మండల ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, మెదక్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు రాహుల్ గారు, మెదక్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకట్ గౌడ్ గారు, మెదక్ టౌన్ ఉపాధ్యక్షులు రాములు గారు, బిజెపి కార్యకర్తలు శివ , సన్నీ , సాయి పాల్గొన్నారు.