రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 1:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల ఆంజనేయస్వామి అలయంలో శనివారం రోజు ఆంజనేయస్వామి జన్మదినం రోజు కావడంతో గ్రామ ప్రజలతోపాటు, హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, చేగుంట మండలాలతో పాటు ఆయా గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవాలయం వద్ద భక్తులు హోమ గుండాలు, యజ్ఞం,పూజలు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం నిజాంపేట జెడ్పిటిసి సభ్యుడు పంజ విజయ్ కుమార్ హాజరై ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం వేద పండితులతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా తొగిట పీతాధిపతి, మాధవానంద సరస్వతి స్వామి వచ్చి ఆంజనేయ స్వామి గురించి భక్తులకు వివరించారు.మనిషి ఆంజనేయస్వామి వలె భక్తి సంపాదించాలంటే ప్రతి మనిషిలో మంచి గుణం, మంచి ప్రవర్తన ఎదుటివారిని కించపరచకుండా ఉండాలన్నారు.మనిషి జన్మ చాలా గొప్పది అన్నారు.ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవాలయం పూజారి సిద్ధ రాములు, భక్తులు పాల్గొన్నారు.