రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 1:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ బిల్డింగ్ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని రెడ్డి కాలనీవాసులు శనివారం ఆరోపించారు.రెడ్డి కాలనీవాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రెడ్డి కాలనీ సమీపంలో కామారెడ్డి రోడ్డులో 5వ వార్డులో కాలనీకి వెళ్లే దారిలో అడ్డుగా అక్రమంగా బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు.అదే విధంగా రెడ్డి కాలనీ లోనికి వాహనాలతో వచ్చే వారికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు.ఈ బిల్డింగ్ అక్రమ కట్టడం నిర్మాణ విషయంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.ఇలాంటి అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై మున్సిపల్ అధికారులు వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రెడ్డి కాలనీవాసులు కోరుతున్నారు.