జిల్లాలో నకిలీ పత్తి కల్తీ విత్తనాలను విక్రయిస్తున్న వారిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ టీం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా , తేది:26.05.2024

జిల్లాలో నకిలీ పత్తి కల్తీ విత్తనాలను విక్రయిస్తున్న వారిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ టీం

జిల్లాలో 3 క్వింటాళ్ళ 25 కిలోలు (రు. 8,12,500 విలువ గల) నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ K.సురేష్ కుమార్,. IPS, గారి ఆదేశాల మేరకు జిల్లా లోని వివిధ మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం సాయంత్రం చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ శివారు ప్రాంతంలో 3 క్వింటాళ్ళ 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది.

టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ గారు తెలిపిన వివరాల ప్రకారం…

చింతలమానేపల్లి మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చాపిలె పురుషోత్తం, మరియు సిర్పూర్ టీ మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బొల్లబోయిన అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు అమాయక రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని, తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు చింతలమానేపల్లి డబ్బా గ్రామ శివారులో సోదాలు నిర్వహించి 3 క్వింటాళ్ళ 25 కిలోలు(రు. 8,12,500 విలువ గల) నకిలీ పత్తి విత్తనాలతో పాటు విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకోవడం జరిగిందన్నారు. అట్టి విత్తనాలను స్వాధినపర్చుకుని ఇద్దరిని చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి వారిపై కేసులు నమొదు చేశామని తెలిపారు.

అమాయక రైతులను మోసం చేసే వారిని, జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు తెలిస్తే తమకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ రాణా ప్రతాప్ గారు తెలిపారు.

ఈ టాస్క్ లో సీఐ. రాణా ప్రతాప్, ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వీ. మధు, పీ. రమేష్, వెంకటేష్ లు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!