రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండల కేంద్రంలో ఎండలు మళ్లీ ముదురుకున్నాయి. నేడు ప్రచండ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా అకాల వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. మళ్లీ ఎండలు ఊపందుకోవడంతో మండల ప్రజలు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. మండుతున్న ఎండలతో ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. జనాలు ఇంటికి పరిమితమయ్యారు.