రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 23:- మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసిల్దార్ రజినీకుమారి గురువారం రోజు మండల పరిధిలోని ధర్మారం శివాయపల్లి రాయిలాపూర్ పర్వతాపూర్ కాట్రియాల దంతేపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పర్యటించి ధాన్యం నిల్వలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యంను అధికారులు లారీల సహాయంతో రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా దాన్యం నిల్వల వద్ద రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట మండల ఆర్ఐ.రాజు తదితరులు ఉన్నారు.