మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గురువారం నాడు అగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారి యాదగిరి మాట్లాడుతూ అగ్రొస్ రైతు సేవా కేంద్రం నందు జీలుగు మరియు పెద్ద జనుము విత్తనాలను అందుబాటులో ఉన్నాయన్నారు. కావలసిన రైతులు ఆధార్ కార్డు , భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ మరియు ఫోన్ నంబర్ లతో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వద్ద వివరాలు నమోదు చేసుకుని పర్మిట్ కాపీ తీసుకువెళ్లాలని తెలిపారు . ప్రభుత్వం తరఫున 60 శాతం సబ్సిడీపై మరియు రైతు వాటాగా 40 శాతం డబ్బులు చెళ్ళించాలి.జీలుగలు 30 కిలోల బస్తా 1 116 రూపాయలు , మరియు పెద్ద జనుములు 40 కిలోల బస్తా 1448 రూపాయలు చెల్లించాలి . ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణిలు విజ్రుంభన, దివ్య, రైతులు పాల్గొన్నారు.