Reporter -Silver Rajesh Medak.
తేది 22.05.2024. ( బుధవారం)
జీవ వైవిధ్యం అనేది భవిష్యత్ తరాలకు విపరీతమైన విలువైన ప్రపంచ ఆస్తి.
అని ఫస్ట్ ఫస్ట్ విద్యార్థి దశ నుండే సమాజానికి అవగాహన చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ పిలుపునిచ్చారు.
.
బుధవారం రోజున సమీకృత కలెక్టర్ సమావేశ హాలులో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ కోఆర్డినేటర్స్ సుదర్శన్ మూర్తి సంబంధిత విద్యార్థినులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య యొక్క ప్రాముఖ్యత మరియు ఈ సమస్యపై అవగాహన కారణంగా, UN ఏటా అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించిందని చెప్పారు.
మానవ మనుగడ జీవవైవిద్యం మీద ఆధారపడి ఉంటుందని ప్రకృతిని కాపాడుకోవడం కోసం మనమంతా నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంటుందని, వాతావరణ నీటి శబ్ద కాలుష్యాలతో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి అకాల వర్షాలు, బ్యాక్టీరియా వైరస్ వ్యాప్తి చెందుతున్నాయని, అడవులు నరికివేత వలన సకాలంలో వర్షాలు పడక పంటలు పండటం లేదని చెట్లు నాటి భూతాపాన్ని తగ్గించి జీవవైవిద్యాన్ని పరిరక్షించాలని, ఇలాంటి అంశాలను భావి భారత పౌరులుగా విద్యార్థి విద్యార్థులు సమాజంలోకి తీసుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 80 శాతం మంది ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం సాంప్రదాయ మొక్కల ఆధారిత మందులపై ఆధారపడుతున్నారని చెప్పారు. మొక్కలు నాటడం వలన పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని చెప్పారు.