Reporter -Silver Rajesh Medak.
తేది -22-05/2024.
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు.
బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ 136 వ జయంతి ఉత్సవాలను సంబంధిత షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, సంబంధిత అధికారులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదు లోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించడం హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారన్నారు.భాగ్య రెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై 1911లో మన్యసంఘాన్ని ఏర్పాటు చేశాడని అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్యసంఘం ద్వారా కొనసాగించడం.మన్యసంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమశాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు