బైండ్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో భారీ చేరికలు

మెదక్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (సిల్వర్ రాజేష్)

తేది -21/05/2024.

మెదక్ జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షుడు బైండ్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు పాపన్నపేట మండలంలో భారతీయ జనతా పార్టీలో భారీ చేరికలు జరిగాయి.

వీరందరికీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది .రఘునందన్ రావు మాట్లాడుతూ పార్టీలో చేరిన కార్యకర్తలు అందరిని మోడీ కుటుంబ సభ్యుడిగా కొనియాడారు వీరందరికీ ఏలాంటి ఇబ్బందులు ఎదురైన తోడుంటానని బిజెపి కుటుంబ సభ్యులుగా మీకోసం ఎల్లవేళలా కృషి చేస్తానని కొనియాడారు. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామం నుండి సుమారు 50 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపి పార్టీలో చేరారు. అలాగే తుమ్మలపల్లి గ్రామం నుండి 20 మంది యువకులు బిజెపి పార్టీలో చేయడం జరిగింది. వీరంతా నరేంద్ర మోడీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చూసి అలాగే గొప్ప నాయకుడు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సారథ్యంలో పనిచేయడానికి సిద్ధమే వీరి పార్లమెంట్ గెలుపు ఖాయం మరొకసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని రఘునందన్ రావు గారి గెలుపు తద్యమని కొనియాడారు. వీరందరూ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ గారి సారధ్యంలో రఘునందన్ రావు గారి చేతుల మీదుగా బిజెపి కండువాను పుచ్చుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో బిజెపిని బలోపేతం చేయడానికి గ్రామాల్లో మరింత కృషి చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా వార్డ్ మెంబర్ నుండి ఎంపిటిసి వరకు జెడ్పిటిసి స్థాయి వరకు అన్ని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోరాటం చేసి బిజెపి గెలుపుకు ప్రయత్నం చేస్తామని కొని ఆడారు సీతానగరం గ్రామం నుండి సీనియర్ నాయకులు దుర్గయ్య నూతన నాయకులు యువకులు మల్లేష్ మరియు రాజు తుమ్మలపల్లి గ్రామం నుండి కిషన్ శ్రీహరి సారధ్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షులు బి.కొండారాములు, మండల ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ఏం.ఎల్.ఎన్.రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ మెదక్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!