మెదక్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (సిల్వర్ రాజేష్).
తేది 05,20, 2024. ( సోమవారం)
ధరణి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి , ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలి తాసిల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు, ధాన్యం కొనుగోలు కేంద్రాల సమగ్ర నివేదికలు తయారు చేయడం, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి పెండింగ్ సమస్యలపై సంబంధిత తాసిల్దారులతో కలెక్టర్ సమీక్షించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో
ధాన్యం జిల్లాలో ఇప్పటివరకు ఎగుమతి, దిగుమతి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం సంబంధిత వివరాలపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని జిల్లాలో ప్రజావాణి దరఖాస్తులు తాసిల్దారుల స్థాయిలో
ఆన్లైన్ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగిందని ప్రజలు అందించిన పెండింగ్ దరఖాస్తులను తీసుకున్న చర్యలపై ఆన్లైన్లో క్లియర్ చేయాలి అన్నారు. జటిలమైన సమస్యలపై అవసరం అయితే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి నివృత్తి చేయాలన్నారు. ప్రజావాణి సమస్యల జూన్ 07 తారీఖు వరకు పరిష్కరించాలని చెప్పారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు ఆర్డీవో మెదక్ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాసులు సంబంధిత తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు