నేటి నుండి పరిపాలన మీద దృష్టి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని,రుణమాఫీ పై ఫోకస్,విద్యాశాఖ మీద ఫోకస్,అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం, బీఆర్ఎస్ ఇచ్చిన బియ్యం సన్న బియ్యం కాదు,నిజమైన సన్నబియ్యం ఇస్తామని, త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందని, రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని,రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని, మరోవైపు దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం కాంగ్రెస్,సగం బీజేపీకి పోతే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని,కాగా కాంగ్రెస్ పై ఎవరు ఏం విమర్శలు చేసినా పట్టించుకోమని, తాము 13 సీట్లు గెలుస్తున్నామని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని,అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పోటీ బీఆర్ఎస్ అని,పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ అని,రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలేనని, బీఆర్ఎస్ అదే చేస్తుందని, ఎన్నికలు ముగిసాయి నేటి నుండి పరిపాలనపై దృష్టి పెడతానని, రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుందని, రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేస్తున్నామని, మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని,మరోవైపు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని, వారిపై చర్యలు ఉంటాయని, ఎన్నికలు అయిపోయాయి కాబట్టి పూర్తి స్థాయి చర్యలు ఉంటాయని, మరోవైపు రిటైర్డ్ ఉద్యోగుల పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిఎం రేవంత్ తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!