జూన్ రెండవ తేదీన ఖమ్మంలో జరిగే బెంచ్ ప్రెస్ పోటీలకు క్రీడాకారులు సిద్ధమవ్వాలని, అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ, జివి రామిరెడ్డి, జాయింట్ సెక్రెటరీ, డాక్టర్ క్రిష్ణ ప్రసాద్, ట్రెజరర్, మహంతి వెంకటకృష్ణాజి ( సుధా జ్యువెలర్స్ అధినేత ) తెలిపారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ జివిరామిరెడ్డి మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని జిమ్ములలో క్రీడాకారులందరూ కోచ్ పర్యవేక్షణలో మంచిగా ప్రాక్టీస్ చేసి, ఈ పోటీలకు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ బెంచ్ ప్రెస్ పోటీలలో, జూనియర్ క్రీడాకారులు మరియు సీనియర్ క్రీడాకారులు, మాస్టర్స్, మహిళలు ఈ పోటీలో పాల్గొనవచ్చును. ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులకు 300 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులు తమ ఆధార్ కార్డుని తీసుకొని రావలెను, ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత టిఫిను మరియు భోజన సదుపాయం ఉందని తెలిపారు. మరిన్ని వివరములకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి 9966588688 నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
Post Views: 19
Related