తేది: 15.05.2024 బుధవారం అనగా ఈరోజున లక్నో నగరం నందు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు దనసరి సీతక్క గారు లక్నో చేరుకుని పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఏఐసీసీ ఆదేశాలను శిరసా వహిస్తూ, అరక్షణం కూడా విశ్రాంతి లేకుండా, తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ మరియు మహబూబ్ బాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకై ఎనలేని కృషి చేసి, వెంటనే ఐదవ విడత పార్లమెంట్ ఎన్నికల కొరకు లక్నో చేరుకుని ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. సీతక్క గారి వెంట ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కల్యాణి గారు కూడా పాల్గొన్నారు.
Post Views: 19
Related