మెదక్ జిల్లా ప్రతినిధి -Silver Rajesh Medak.
తేదీ 14-5-2024
మెదక్ జిల్లా.
పటిష్ట భద్రత మధ్య ఈ వి యం లను
భద్రపరచడం జరిగింది
— జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ రాహుల్ రాజ్.
సాధారణ ఎన్నికలు 2024 ,నిన్న జరిగిన మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 సెగ్మెంట్ల ఈవియం లను పటిష్ట భద్రత మధ్య భద్రపరచడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ వివరించారు.
మంగళవారం నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచుట, సీల్ వేయడంలో భాగంగా సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి, సమక్షంలో సంబంధిత నియోజకవర్గాల ఏఆర్వోలు రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి సీల్ వేయడం జరిగిందన్నారు.దీనితో పాటు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూం నకు కుడా సీల్ వేయడం జరిగిందని, ఎన్నికల కు సంబంధించిన పేపర్ మెటీరియల్ కు చెందిన స్క్రూటినీ రిపోర్ట్ లు, స్టాట్యూటరీ రిపోర్ట్ లు ఎన్నికల పరిశీలకుల సమక్షం లో సీల్ వేశామని అన్నారు. మంగళవారం ఎలక్షన్ పేపర్ స్ట్రాంగ్ రూం ను ఓపెన్ చేసి అబ్జార్వర్ అభ్యర్థుల తరపున వచ్చిన ప్రజా ప్రతినిధుల సమక్షం లో స్క్రూటినీ చేయడం జరిగిందని మెదక్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధి లోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ లలో అతి ఎక్కువ అతి తక్కువ పోలింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాలు, ఈ వి ఎం లు, రీప్లేస్మెంట్ జరిగిన బూత్ లు వంటి వాటిని స్క్రూటిని చేసి పరిశీలించడం జరిగిందని, అన్ని అంశాలు కూడా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సాఫీగా, విజయవంతం గా జరిగాయని నిర్ధారణకు రావడం జరిగిందని, అన్ని గణాంకాలు సరిపోవడం తో ఎక్కడ కూడా రీ-పోలింగ్ కు అవకాశం లేదని మెదక్ పార్లమెంట్ పరిధి లో ఎలాంటి రీ-పోలింగ్ కు అవకాశం లేకుండా ఎన్నికలు పూర్తి చేయడం జరిగిందని, పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి లో మొత్తం .75.09 % పోలింగ్ నమోదు కావడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారిగా నమోదైన శాతం కూడా వెల్లడించడం జరిగిందని చెప్పారు.
. సీసీ టీవీకెమరాల మధ్య ,కేంద్ర ప్రభుత్వ సాయుధ దళాల పహారాలో భద్రపరుస్తున్నామన్నారు. గజ్వేల్, దుబ్బాక మెదక్,నర్సాపూర్,సిద్దిపేట నియోజకవర్గాల ఈ వి యం లను BVRIT ఇంజనీరింగ్ కళాశాలలో, సంగారెడ్డి , పటాన్చెరు నియోజకవర్గాల ఈ వి యం లను ప్రభుత్వ గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో భద్రపరిచామని అన్నారు. మెదక్ పార్లమెంటు నియోజక వర్గ పరిదిలో అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గం లో 84.25 శాతం నమోదు కాగా అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గం లో 63.01 శాతం గా నమోదు అయిందన్నారు.
గత 2019 పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కంటే ఇప్పుడు 2024 లో దాదాపు 4 శాతం పైగా ఓటింగ్ పెరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట అదరపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ బాల స్వామి,అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు,నియోజకవర్గాల ఏఆర్వోలు , డీఎస్పీలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.