రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గ్రామంలో సోమవారం రోజు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ నెంబర్ 89లో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భారతదేశ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమర్థ నాయకుని ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.