Reporter -Silver Rajesh Medak.
Date-11/05/2024.
ఎన్నికల్లో సీ విజిల్ యాప్… మీరూ వాడుకోండి ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట సీవిజిల్ ఆప్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ… బాద్యతాయుత పౌరుని చేతిలో బ్రహ్మస్త్రం ఓటు అని సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు ఒక వజ్రాయుధం ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి కేవలం ఒక ఓటుకే ఉంటుంది భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి తమ వంతు బాధ్యతగా తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ తన ఓటును ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని దానికి ఎంతో సార్ధకత ఉంటుంది ఓటు విలువైన ఆయుధం ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవడం అని అన్నారు.అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ఎన్నికల నిబంధనలు రాజకీయ పార్టీలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ యాప్‌ను (cVIGIL App) ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తన దృష్టికి వచ్చిన ఎన్నికల ఉల్లంఘన కార్యక్రమాలను ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అభ్యర్థుల దుష్ప్రవర్తన సంబంధిత ఫొటోలు, విడియోలను సీ విజిల్ యాప్లో అప్‌లోడ్ చేస్తే.. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో ఎన్నికల విభాగం అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి సీవిజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్ని స్మార్ట్‌ఫోన్లకు ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.ఎన్నికల్లో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్టు మీకు తెలిస్తే రహస్యంగా ఫోటోలు తీయాలి. వాటిని సీవిజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేసి వివరాలు తెలపాలి. 2 నిమిషాల నిడివిగల వీడియో కూడా అప్‌లోడ్ చేయొచ్చు. ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసే సమయంలో జీపీఎస్ ఆన్‌లో ఉండాలి. అభ్యర్థులు, స్థానిక నాయకులు ఎవరైనా వచ్చి తమ పార్టీకే ఓటు వేయాలని డబ్బులు పంచేందుకు ప్రయత్నించినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అంతేకాదు… ఎవరైనా సభలు, సమావేశాల్లో విద్వేషపూరితంగా కామెంట్స్ చేసినా ఫిర్యాదు ఇవ్వొచ్చు. మీరు పంపిన ఫోటోలు, వీడియోలు నేరుగా భారత, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వెళ్తాయి. జీపీఎస్ ట్రాక్ చేసి లొకేషన్ మ్యాప్ చేస్తారు.అక్కడ్నుంచి సమీపంలో ఉన్న డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి. వాటిని మీ లొకేషన్‌కు దగ్గర్లో ఉండే ఎన్నికల బృందాలకు సంబంధిత అధికారులు పంపిస్తారు.వెంటనే స్పెషల్ పార్టీ రంగంలోకి దిగి అక్రమాలను అడ్డుకుంటాయి. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీకు యూనిక్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ద్వారా మీ కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కంప్లైంట్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా మీకు ఫీడ్ బ్యాక్ వస్తుంది. బాధ్యత గల పౌరులు ఈ యాప్‌ను ఉపయోగించుకుంటే ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడ్డట్టే. కాబట్టి బాధ్యత గల పౌరులుగా మీరు కూడా ఎన్నికల్లో అక్రమాలపై కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే సీవిజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు కోరారు. సీ విజిల్ 24 గంటలు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ యాప్ చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలను నిర్ములించేందుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అన్నారు.