అమానవీయ ఘటన.. మురికి కాలువలో ఆడ శిశువు మృతదేహం
హుజురాబాద్ పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల మురికి కాలువలో శుక్రవారం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. అటుగా వెళుతున్న కొందరు శిశువును గమనించారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.