రామాయంపేట (స్టూడియో10
టీవీ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపుకు మద్దత్తుగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు 5వ వార్డులో రోడ్డు పక్కన గల పలు దుకాణ సముదాయాలలో ప్రచారం చేశారు.అనంతరం పట్టణంలోని 6వ వార్డులో కౌన్సిలర్ దేమే యాదగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.1వ వార్డులో భైరం కుమార్ ప్రచారం చేశారు.అదే విధంగా గోల్పర్తి గ్రామంలో 7వ వార్డులోఎర్రం సత్యం ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేమే యాదగిరి, బైరం కుమార్ అల్లాడి వెంకటేష్ వైయస్. వెంకటి,ఎర్రం సత్యం,తొంటవాలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.