Reporter -Silver Rajesh Medak.
తేది 7.5.2024.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి: జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, మెటీరియల్ పంపిణీకి ఏలాంటి ఇబ్బందులు రావొద్దనిజిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యలయం లోని విడియో కాన్ఫరెన్స్ హల్ లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రలలోని
ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణలో భాగంగా ఈ నెల 13 వ తేదీన నిర్వహించే ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి 12వ తేదీన ఎన్నికల సామాగ్రి అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కరోజు ముందుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుతుందన్నారు.
ఎన్నికల విధులలో పాల్గొనే పి.ఓ.లు, ఏ.పి.ఓలు,ఓ.పీ.ఓ లు సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ల ద్వారా అందించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పోలింగ్ సిబ్బంది కోసం త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బందికి మంచి భోజన వసతులు కల్పించాలని అన్నారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఈవిఎం యంత్రాలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవిఎం యంత్రాలను సరి చూసి అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
రిజర్వ్ పోలింగ్ సామాగ్రి, ఈవిఎం యంత్రాల సెక్టార్ అధికారుల వద్ద ఉంటాయని, పోలింగ్ సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులు రిజర్వ్ ఈ.వి.ఎం యంత్రాలతో భర్తి చేయాలని అన్నారు.
పోలింగ్ రోజు సెక్టార్ అధికారులు ప్రైవేట్ వాహనాల్లో ఈ.వి.ఎం యంత్రాల, పోలింగ్ సామాగ్రి తరలించడానికి వీలు లేదని, ప్రభుత్వ వాహనాల్లో పటిష్ట పోలీస్ భద్రత మధ్య సెక్టార్ అధికారులు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
వేసవిని దృష్టిలో ఉంచుకుని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సిబ్బందికి నీడ ఉండే విధంగా చర్యలు చేపట్టి కూలర్లు ఏర్పాటు చేయాలన్నారు, చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
మున్సిపల్ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలని డిస్ట్రిబ్యూషన్ రోజు మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఏ ఆర్ ఓ లు , డీఎస్పీ డా: రాజేష్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.