▪️ బిజెపి, బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదు :
▪️ నార్సింగి రైతు కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి.
నార్సింగి మండల కేంద్రంలో రైతు కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు రైతు కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని .గ్రామీణ ప్రాంతాలలు అభివృద్ధి చెందాలంటే ఆది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో అనేక గొప్ప ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత తమదని అన్నారు. రాజ్యాంగం రక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలన్నారు. పేదోళ్ల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి మెదక్ అభ్యర్థి నీలంమధు ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి (బాచి) స్వామి అంచనూరి రాజేష్. సిహెచ్ ప్రభాకర్. రోమల్ల రాజు. గుర్రాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.