Reporter -Silver Rajesh Medak.
Date-03/05/2025.
మెదక్ నియోజకవర్గం పాపన్నపేటలో నిర్వహించిన రోడ్ షో లో ఎంపి అభ్యర్థి వెంకట్ రామారెడ్డి కామెంట్స్.
11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో మీకు సేవ చేసే భాగ్యం కలిగింది.
మీ ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను. మీ సేవకుడిగా, మీలో ఒకడిగా ఉండాలని మీ ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను.
ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతో, నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తాను.
పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మీ ఎంపీగా నన్ను దీవించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.