Reporter -Silver Rajesh Medak.
తేదీ 3 -5- 2024
*ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ .
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా లోని పి.ఓ, ఏ.పి.ఓ, పోలింగ్ సిబ్బందికి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవసారి జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి పోలింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల ఎన్నిక అధికారి కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్ క్లాస్ లాకు తప్పని సరిగా హాజరు కావాలని తెలిపారు. పోలింగ్ డే సందర్భంగా పి.ఓ లు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యత పై క్లుప్తంగా వివరించారు. ఎన్నికల కమిషన్ ప్రతి అంశానికి విధులకు సంబంధించిన నిబంధనలు జారీ చేసిన నేపథ్యంలో పి.ఓ బుక్ ను పొందుపర్చిన నియమావళి ప్రకారం గా విధులు నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్ సందర్భంగా పాటించవలసిన అంశాల గురించి వివరించారు.
మాక్ పోలింగ్ ఉదయం 5.30 గంటల లోగా పూర్తి చేయాలని, కనీసం ఇద్దరు ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
పి.ఓ లు ఎలాంటి పొరపాట్లు చేయరాదని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈ.వి.ఎం లు తీసుకొని పోలింగ్ డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వవలసిన బాధ్యత పి.ఓ లేదన్నారు. , పోల్ తర్వాత రిపోర్ట్ తయారు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని సమర్థవంతంగా అమలు చేయాలని, తప్పులు జరిగితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారని,ఓటరు బూత్ దగ్గర బి.ఎల్.ఓ సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. . ఓటరు జాబితాలో పేరు ఉంటేనే లోనికి రానివ్వాలని,
నిర్దేశించిన సమయంలో పోలింగ్ ఏజెంట్ ఉండాలి. ఓటరు స్లీప్ ఐడి కాదని, ఎన్నికల కమిషన్ గుర్తించిన గుర్తింపు కార్డ్ లను తీసుకొని రావాలి అని,
రిసెప్షన్ సెంటర్ లో టేబుల్స్ ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుందనీ, పోలింగ్ బూత్ వద్ద టాయిలెట్, త్రాగు నీరు, లైటింగ్, లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ.వి.ఎం ల బాధ్యత పి.ఓ లదే అన్నారు.
పోలింగ్ ఏజెంట్ స్థానిక పోలింగ్ స్టేషన్ లో ఉంటే అతనికి ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేయాలి. పోలింగ్ బూత్ ఏజెంట్ ఆ నియోజకవర్గంలో ఓటరు అయి ఉండాలని , అంథూలు ఓటు వేసే సందర్భంగా 18 సంవత్సరాల వయస్సు దాటిన వారు మాత్రమే అర్హులు. సహాయకులుగా వచ్చిన వారికి రైట్ హ్యాండ్ నెక్స్ట్ ఫింగర్ కు సిరా చుక్క వేయాలి. పోలింగ్ సిబ్బందికి సర్వీస్ ఓటరు గా ఫారం-12D ఇవ్వడం జరుగుతుందనీ ,
ఒక్కొక్క ఎలక్షన్ కు నిబంధనలు మారుతున్న నేపథ్యంలో పి.ఓ లు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి అని అన్నారు.శిక్షణ కార్యక్రమం ను సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మెదక్ ఆర్డిఓ రమాదేవి,తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర, , మెదక్ తహసిల్దార్ శ్రీనివాస్, సైన్స్ అధికారి రాజిరెడ్డి ,పోలింగ్ అధికారులు,సహాయక పోలింగ్ అధికారులు ,ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.