Reporter -Silver Rajesh Medak.
Date-01/05/2024.
అర చేతిలో అంతర్జాలంతో జాగ్రత్త
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి
లేదా https://cybercrime.gov.in/ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ రోజు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును సైబర్ సెక్యూరిటీ బ్యూరో D.S.P.సుభాష్ చంద్రబోస్ గారు, మెదక్ పట్టణ సి.ఐ.దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మెదక్ నందు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో D.S.P శ్రీ.సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడుతూ….సాదారణగా ప్రజలు ఆశ భయం వల్ల సైబర్ నేరాలకు గురి అవుతున్నారని అనారు. అలాగే అసలు సైబర్ నేరాలు అనగా ఏమిటి?, సైబర్ నేరాల రకాలు మరియు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేయడం జరిగింది.దీనిలో భాగంగా Fake Bank Call Frauds, Debit/ Credit card frauds, Advertisement frauds, loan app frauds, Courier frauds, women DP changing frauds ల పై వివరంగా విద్యార్ధులకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరో తెలియని నేరస్థుడు సాంకేతికతను, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్ల రూపంలో దోచుకుంటున్నారని అన్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల మనమంతా అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించవచ్చని అన్నారు. అలాగే ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి యుండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేగాక సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
సైబర్ ఫ్రాడ్ కాల్స్ మోసం జరిగే విధానం:
సైబర్ మోసగాళ్లు ప్రముఖ లోన్ సంస్థల పేర్లతో లోన్స్ ఇస్తాం అని చెప్పి మోసాలు చేస్తున్నారు. లోన్ రావాలంటే ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీల కింద అమౌంట్ పంపాలని చెప్పి డబ్బులు కాజేస్తారు.
సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో కాల్స్ చేసి మాయమాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్నారు. నిజమైన ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని డబ్బులు లేదా బ్యాంకు వివరాలు అడగరు.
సైబర్ మోసగాళ్లు ప్రముఖ సంస్థల పేర్లతో కాల్స్ చేసి మీకు స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయని, మా కంపెనీ ఆఫర్స్ ఇస్తుంది అని చెప్పి మోసాలు చేస్తున్నారు. ఏ సంస్థలు ఎలాంటి కాల్స్ చేయవని గుర్తుంచుకోండి.
జాగ్రత్త సూచనలు :
గుర్తు తెలియని వ్యక్తులు లోన్ ఇస్తాం అని చెప్తే నమ్మకండి, లోన్స్ కోసం బ్యాంక్స్ ని సంప్రదించండి.
మీకు డబ్బులు వచ్చాయి అని చెప్పి మిమ్మల్ని డబ్బులు పంపించమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్లు అని గుర్తించండి.
ఆఫర్స్ లేదా స్క్రాచ్ కార్డ్స్ సంబంధించి అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే క్లెమ్ చేస్కోండి
https://cybercrime.gov.in/ ద్వారా, 1930 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
APK /EXE మోసం జరిగే విధానం:
(WhatsApp, Facebook Messages, Instagram and Telegram etc..) నందు ఎవరైన తెలియని వ్యక్తి నుండి గాని, తెలిసిన ఫోటో ఉన్న ప్రొఫైల్ నుండి గాని APK.EXE ఫైల్ వస్తే వాటిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చెయ్యకండి.
అలాంటి APK ఫైల్స్ మీ మొబైల్ కి వచ్చే కాల్స్ మరియు మెసేజెస్ ని సైబర్ మోసగాళ్లకు ఫార్వర్డ్ చేస్తాయి.
EXE ఫైల్స్ మీ కంప్యూటర్ లో వున్న మీ వ్యక్తి గత మరియు బ్యాంకింగ్ కి సంబంధిన పూర్తి వివరాలను సైబర్ మోసగాళ్లకు అందచేస్తాయి.
జాగ్రత్త సూచనలు :
అపరిచిత వ్యక్తులు పంపిన లింక్స్ పై క్లిక్ చెయ్యకండి. వాళ్ళు పంపిన ఎలాంటి యాప్స్ (APK ఫైల్స్) ఇన్స్టాల్ చెయ్యకండి. మీ బ్యాంకు వివరాలు మరియు ఓ.టి.పి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకండి.
అన్అఫీషియల్ (అనధికార) సోర్లు, థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ మాల్వేర్ (Malware) స్పెవేర్ (Spywarc) ఉంటుంది, అవి మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ పాస్వర్డ్లను దోచేస్తాయి.
సైబర్ క్రైమ్ ని WWW.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి
ప్రకటనల ద్వారా మోసం జరిగే విధానం:
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, గూగుల్ ప్లాట్ ఫారమ్స్ వస్తున్నా ప్రకటనలు అన్ని నిజమైనవి కాకపోవచ్చు, వాటిని నమ్మి ముందుగా డబ్బులు చెల్లించి మోసపోకండి.
సైబర్ మోసగాళ్లు ఎల్ట్రోనిక్, బట్టలు మరియు ఇతర నకిలీ ప్రకటనలతో మిమ్మల్ని ఆకర్షించి మెయిల్ ద్వారా కాని మెసేజ్ ద్వారా కాని లేదా ఫోన్ కాల్ ద్వారా కాని మీ బ్యాంకు వివరాలు మరియు ఓటిపి తెలుసుకొని మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ దోచేస్తారు.
కాష్ ఆన్ డెలివరీ పెట్టిన, ముందుగా మీకు నకిలీ లేదా డ్యామేజీ అయిన వస్తువులు పంపించి, మీరే వాళ్ళ కాంటాక్ట్ లోకి వెళ్లేలా చేసి, మీ బ్యాంకు వివరాలు మరియు ఓటిపి తెల్సుకొని డబ్బులు లాగేస్తారు.
జాగ్రత్త సూచనలు :
నమ్మదగిన websites నుండి మాత్రమే షాపింగ్ చెయ్యండి. ఆన్లైన్ లో తక్కువ ధర కి వస్తున్నాయి అని కొనుగోలు చెయ్యటానికి మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు తెలియజేసి సైబర్ మోసాలకు గురి కాకండి.
అపరిచిత వ్యక్తులు పంపిన లింక్స్ పై క్లిక్ చెయ్యకండి. మీ బ్యాంకు వివరాలు మరియు ఓ.టి.పి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకండి అని తెలియచేసారు.