నార్సింగి : కాంగ్రెస్ పార్టీ అధికారం లేని సమయంలో పార్టీ జెండాలను మోసి, అవమానాలు పొంది, జైలు పాలై , బైండోవర్లు ఎదురుకుని ఎన్నో అవమానాలు పొందిన అసలు సిసలు అయిన మమ్ములను పట్టించుకోవడం లేదని మండల ఫిషర్ మెన్ అధ్యక్షుడు సుధాకర్ ఆరోపించారు. నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు క్యాడర్ను కలుపుకొని పోవడం లేదని, కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలంలో తాము ఇతర నాయకుల లాగా పార్టీ మారకుండా, పట్టుదలతో కృషి చేసి క్షేత్రం లో పార్టీని పటిష్టం చేశామని అన్నారు. తాము ఎలాంటి సమయంలో అయినా బెదరకుండా పార్టీ జెండాలను మోసామని, అరెస్టు అయి అవమానాలను ఎదురుకుని, బైందోవర్లు తట్టుకుని, అష్ట కష్టాలను ఎదుర్కొన్నామని, అలాంటిది ఈనాడు మాకు కాదని, కనీస మండలంలో ముఖ పరిచయాలు లేని వ్యక్తులను నియమించడం ఎంత వరకు సబబు అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఇతర గ్రామాల వారి తమ పై చలాయింపులు చేస్తున్నారని, ఇది తగదని ఇలాగే కొనసాగితే దానికి తగ్గ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేశాన్ని వ్యక్తపరిచారు. కష్టకాలంలో పనిచేసిన పాత క్యాడర్ ను అన్యాయం చేసి పోగొట్టుకోవద్దని, పార్టీ నాయకత్వం ఇది గమనించాలని కోరారు. కష్టం మాది సుఖం మరొకరిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పక్క గ్రామాల వారి చెలాయింపుల పై వెంటనే స్పందించి తగిన రీతిలో పరిష్కారం చూపాలని కోరారు. అలాగే పిఎసిఎస్ కో ఆపరేటివ్ సొసైటీ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం అవమానకరమని, నాయకులు కనీసం గమనించే స్థితి లో కూడా లేరని, సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటాన్ని ఏర్పాటు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు.