స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 30, మహానంది:
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం మహానంది మండలం మజార గ్రామపంచాయతీ గాజులపల్లె, బసాపురం, ఆంజనేయ పురంలలో ఎమ్మెల్యే శిల్పా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, వడుగురి రామకృష్ణుడు,గజ్జ పెద్ద పకీరయ్య పూలమాలతో ఘనంగా సన్మానించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ..పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద ప్రజల సంతోషంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో కుల,మత, రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ, సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు.జగన్ మోహన్ రెడ్డి ఇదేళ్ల మంచి పరిపాలన దృష్టిలో పెట్టుకొని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.