Reporter -Silver Rajesh Medak.
Date-26/04/2024.
పోలింగ్ పర్సన్ రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
పోలింగ్ పర్సన్ రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ ముగిసింది.
ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటీ
, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో కలెక్టరేట్ లో రెండవ విడత ర్యాండమైజేషన్ జరిగింది.
ఎన్నికల సాధారణ పరిశీలకులు పర్యవేక్షించారు. సాఫ్ట్వేర్ పనితీరు.. పోలింగ్ సిబ్బంది అలాట్మెంట్ వివరాలను టెక్నికల్ మేనేజర్ ను పరిశీలకులు అడిగి తెలుసుకున్నారు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహించి. సిబ్బందిని సెకండ్ రాండనైజేషన్ ద్వారా అలాట్ చేశామని పేర్కొన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓపీఓ లను మొత్తం 3,540 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అలాట్ చేశామని చెప్పారు
వీరికి ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధ్యత యుతంగా అధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు.
చివరగా జరిగే పోలింగ్ పర్సన్ మూడవ విడత ర్యాండ మైజేషన్ ప్రక్రియలో పోలింగ్ సిబ్బందిని పోలింగ్ బూతుల వారిగా కేటాయిస్తామన్నారు.