Reporter -Silver Rajesh Medak.
Date- 25.04.2024.
జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ శ్రీ.డాక్టర్ రామేశ్వర్ సింగ్, ఐపీఎస్. డిఐజి గారు
శాంతి భద్రతలు, చెక్పోస్టులు, స్వాధీనం చేసుకున్న సామాగ్రి, జిల్లాలో కల పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై చర్చ.
అనుమానాస్పదంగా అనిపించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.
సమస్యలు లేదా ఎన్నికల పారదర్శకత పై ప్రజలు నేరుగా నా మొబైల్ నెంబర్ +9191772 99185 కు ఫోన్ చేయవచ్చు
పోలీస్ అబ్జర్వర్ శ్రీ.డాక్టర్ రామేశ్వర్ సింగ్, ఐపీఎస్. డిఐజి .
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మెదక్ జిల్లాకు పోలీస్ అబ్జర్వర్ గా శ్రీ.డాక్టర్ రామేశ్వర్ సింగ్, డిఐజి ఐపీఎస్ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డా.బి.బాలస్వామి ఐపీఎస్ .డాక్టర్ రామేశ్వర్ సింగ్, డిఐజి ఐపీఎస్ ని సాదరంగా జిల్లాకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు మెదక్ జిల్లా శాంతిభద్రతల నిర్వహణ, అంతర్ రాష్ట్ర మరియు జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, ఇప్పటివరకు జిల్లా నందు పట్టుబడిన అక్రమ మద్యం, డబ్బు, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాల వినియోగింపు, జిల్లాలో కల పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం నర్సాపూర్ BVRIT కళాశాలలో మరియు అల్లూరి సీతారామ రాజు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన EVM స్ట్రాంగ్ రూమ్ ని సందర్శించి అక్కడి ఏర్పాటు చేసిన రిజిస్టర్ ని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటి అనుమానాస్పద అంశం తమ దృష్టికి వచ్చిన క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల పోలీస్ పరిశీలకులు డాక్టర్ రామేశ్వర్ సింగ్, ఐపిఎస్ డీఐజీ ఆదేశించారు. మెదక్ జిల్లా నియోజక వర్గాల్లో ఎక్కడైనా ఎన్నికల ప్రభావిత అంశం ప్రజల దృష్టికి వస్తె నా మొబైల్ నెంబర్ +9191772 99185 కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ప్రజలకు సూచించారు. జిల్లా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఎన్నికలకు సంబంధించిన ప్రభావిత అంశాల పైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు నివేదించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్.మహేందర్ , ఎస్బి సిఐ సందీప్ రెడ్డి , పాల్గొన్నారు.