పర్యాటక కేంద్రం అయిన లక్నవరం సరస్సును వీక్షించిన మంత్రి సీతక్క గారు…
బోటింగ్, ఉయ్యాల వంతెనను సందర్శించి లక్నవరం సరస్సు అందాలను వీక్షించారు…
తేది: 26.04.2024 శుక్రవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల లక్నవరం కొండల నడుమున అందమైన ప్రకృతి ఒడిలో పుట్టిన లక్నవరం సరస్సును తెలంగాణ రాష్ట్ర పంచయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి సీతక్క గారు వీక్షించి, సరదాగా బోటింగ్ చేసి లక్నవరం అందాలను వీక్షించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని ఇంకా లక్నవరం అందాలను ద్విగుణీకృతం చేసి, అత్యంత రమణీయ సరస్సు అందాలను పర్యాటకులకు ఇంకా అందంగా చూయించే విధంగా లక్నవరం సరస్సును తీర్చి దిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా, మండల, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.