ప్రమాదవశాత్తు రైలు ఢీకొని యువతి మృతి చెందిన సంఘటన నార్సింగి మండలంలో చోటుచేసుకుంది మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన పంబల్ల రమ్య అనే 18 సంవత్సరాల అమ్మాయి బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తున్న క్రమంలో కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొని రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ ఘటనా స్థలం చేరుకొని పంచనామ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం తనకు ఇద్దరు అమ్మాయిలని పెద్దమ్మాయికి పెళ్లి చేసే అత్తారింటికి పంపించడం జరిగిందని చిన్నమ్మాయి కొడుకు లాగా వ్యవసాయ పొలం పనులను చూసుకుంటుందని యధావిధిగా ఈరోజు కూడా పొలం వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందిందని ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తావునాయక్ తెలిపారు.