రామాయంపేటలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

Venkatramulu Ramayampet Reporter

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని 6,12 వార్డులలో బుధవారం రోజు పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంటు బిజెపి అభ్యర్ధి మాధవనేని రఘునందన్ రావు భారీ మెజారిటీ తో ఓట్లు వేసి గెలిపిస్తామని ఓటర్లు ఈ సారి మోడీ కి ఓటు వేస్తామని ఇంటింటికి తెలిపారని అన్నారు. విద్యావంతుడు, మేధావి, న్యాయవాది బిజెపి అభ్యర్ధికి ఓటు వేస్తే మన మెదక్ పార్లమెంట్ అభివృద్ది అయితదని పేర్కొన్నారు. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే మోడీ దేశానికి ప్రధానమంత్రి గా ఉండి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ది చేయలేని అసమర్థ, అవినీతి పరులు పార్టీకి, 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కుటుంబ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా వద్దా అనేది ప్రజలందరు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినపుడు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయటంలో ఈ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయంటూ ప్రజలు వివరించినట్లు వెల్లడించారు. బిజెపి నాయకులు కార్యకర్తలు పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను మా పార్టీ కి వేసి గెలిపించాలని అభ్యర్థించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!