రామాయంపేట మున్సిపాలిటీలో ఇంటింటికి బిజెపి ఎన్నికల ప్రచారం
Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎంపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ బిజెపి సీనియర్ నాయకులు జె.శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి మరోసారి ప్రధాని మోడీ కావాలంటే ఈ దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే దేశం సురక్షితంగా ఉండాలంటే బిజెపితోనే అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలన్న తెలంగాణ అభివృద్ధి జరగాలన్న అది కేవలం మోడీతోనే సాధ్యమని పేర్కొన్నారు.గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ సెంటిమెంటుతో కెసిఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు.కాబట్టి ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి ఇంటికి పంపించడం జరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అమలు కానీ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 9 లక్షల కోట్ల నిధులను తెలంగాణకి ఇచ్చి రైతుల సంక్షేమానికి పాటుపడిన ప్రభుత్వం బిజెపిదే అన్నారు.ఈ ప్రచారంలో ఇంటింటికి వెళ్లి బిజెపి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.