బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కి రాజీనామా
నార్సింగి : మండల బీఆర్ ఎస్ పార్టీ లో ఉద్యమకారులకు, సీనియర్ నాయకులకు కూడా పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం వల్ల మనస్తాపం తో బీఆర్ ఎస్ పార్టీ నార్సింగి మండల ప్రధాన కార్యదర్శి పదవికి నార్సింగి పార్టీ మాజీ ఇంచార్జ్, మాజీ టెలీకామ్ బోర్డు మెంబర్, న్యాయవాది అంచనూరి రాజేష్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను 2004 నుండి పార్టీ లో టీఆర్ఎస్ వీ నార్సింగి గ్రామ శాఖ, చేగుంట మండల శాఖ అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గా, టెలీకామ్ బోర్డు మెంబర్ గా, 2018 సాధారణ ఎన్నికల లో నార్సింగి ఇంచార్జ్ గా, ప్రస్తుతం మండల బీఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్నానని తెలిపారు. రాజేష్ ఇంకా మాట్లాడుతూ ఇటీవల సాధారణ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి, పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలకు మండల పార్టీ లో నెంబర్ 2 స్థానం లో ఉన్న తనకే సమాచారం ఇవ్వకపోవడం, ఇటీవల జరిగిన పార్టీ సభలల్లో కూడా కావాలని చివరికి నిమిషంలో పిలవడం వంటి చర్యలు చేసి అవమానించేలా చేస్తున్నారని, అలాగే ధర్నా, ఆందోళన కార్యక్రమలకు మాత్రం ముందుగానే సమాచారం ఇచ్చి పిలవడం చేస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. తన లాంటి పార్టీ సీనియర్, ఉద్యమ నాయకులకే ఇలా అగౌరవy పరిస్తే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని, పార్టీ లో ముఖ్యమైన పదవి లో ఉన్నా విలువ లేనపుడు సామాన్య కార్యకర్తలను పట్టించుకొనే వారు ఎవరని ప్రశ్నించారు. అందుకే తాను కూడా ఇప్పటి నుంచి సామాన్య కార్యకర్త గా ఉంటానని, తాను తన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తనలా రాజీనామా చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని, కానీ వాళ్ళు తమ బాధను చెప్పు కోలేకపోతున్నారని చేపారు. గతం లో కూడా ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా ఉన్నపుడు తనకు టెలీకామ్ బోర్డు మెంబర్ గా మొట్ట మొదటి అవకాశం ఇచ్చారని, అనంతరం మండల పార్టీ పదవి కూడా ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి తన వంతుగా 2024 ఎన్నికలలో మనస్ఫూర్తిగా పని చేశానని, ప్రభాకర్ రెడ్డి తనకు ఇచ్చిన గౌరవాన్ని జీవితాంతం మరువలేనని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ మండల పార్టీ లో ఎమ్మెల్యే ఆదేశాలను తప్పుదోవ పట్టిస్తున్న మండల పార్టీ బాధ్యుడికి అసలు నార్సింగి గ్రామ కమిటీ ఉందా లేదా పనిచేస్తుందా పనిచేయడం లేదా అన్న విషయం కూడా తెలియదని, గత ఎన్నికలలో ఆయన వైఖరి వళ్ళ కొంత మంది ముఖ్యమైన పదవులున్న, ఉద్యమ నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారని వాపోయారు. ఇప్పటికైనా ఇలాంటి వారిని మార్చి పార్టీ ని, పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానని అన్నారు.