-ఎస్ఐ నాగేంద్రప్రసాద్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 17, మహానంది:
రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుమతి లేకుండా మద్యం,డబ్బు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మహానంది మండలం గాజులపల్లి గ్రామ పరిధిలోని అంజనేయ పురం చెక్ పోస్ట్ వద్ద కేంద్ర బలగాల పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై నాగేంద్రప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వాహనలు క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. డబ్బు నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలను తమతో ఉంచుకోవాలని, రూ. 50వేల నగదు మించి ఉంటే వాటికి ఆధారాలు చూపించాలని, ఆనగదుకు ఆధారాలు చూపించకపోతే నగదును సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనీఖీల్లో మహానంది పోలీస్ సిబ్బంది శేఖర్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, రసూల్, కేంద్ర బలగాల పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.