Reporter -Silver Rajesh Medak.
Date-16/04/2024.
54 టన్నులు 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ప్రత్యేక చర్యలు జిల్లా ఎస్.పి. డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. శ్రీ.డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ…తేది: 16/04/2024 నాడు, విశ్వసనీయ సమాచారం మేరకు భారీ మొత్తంలో అక్రమంగా తలరిస్తున్న పిడియస్ రైస్ ను పట్టుకున్నామని తెలిపినారు వాటి వివరాలను తెలియజేస్తూ…
అక్రమంగా అదనపు డబ్బులు సంపాదించాలనే భావనతో ప్రభుత్వ ఉద్ధేశ్యాలను, లక్ష్యాలను పక్కనపెట్టి, స్వలాభం కొరకు, పిడియస్ రైస్ ను వాళ్ళ ప్రాంతంలో నివసించే పేదలకు అందించే ధాన్యాన్ని పేద ప్రజల నుండి సేకరించి, గడిపెద్దపూర్ గ్రామం, అల్లదుర్గ్ ప్రాంతంలో లో గల శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ గడిపెద్దాపూర్ యజమాని అయిన బి. రమేశ్ అదనపు డబ్బులు ఆశించి , అమ్మటం కొరకు వస్తుండగా, విశ్వసనీయ సమాచార మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది రైస్ మిల్ దగ్గరలో పట్టుకోవటం జరిగినది. రైస్ మిల్ నడుపుతున్న యజమానులు, ప్రభుత్వం నుండి వడ్లను కొనుగోలు చేసి, తన రైస్ మిల్లులో వడ్లను ప్రాసెస్ చేసి, ప్రభుత్వ పంపిణీ పిడియస్ రైస్ గా మార్చి FCI గోదాంలకు పంపించటం జరుగుతుంది. ఈ విదంగా చేసి రైస్ మిల్ యజమానులు అదనంగా లాభాలను అక్రమంగా సంపాదిస్తునారు ఇట్టి చర్యకు పాల్పడిన అందరి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.అలాగే జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణా కట్టడికి రెవెన్యూ, గనులశాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖతో కలిసి చర్యలు చేపడుతున్నామన్నారు. అక్రమ కార్యకలాపాలపై జిల్లా ఎస్.పి గారి ఫోన్ 8712657900 నంబర్ కి నేరుగా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ రైస్ పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించి వారికి రివార్డులు అందించడం జరిగింది.
కేసు యొక్క వివరాలు:
స్వాదీనం చేసుకున్న పిడియస్ రైస్: 54 Tons, (540 quintal)
స్వాదీనం చేసుకున్న పిడియస్ రైస్ విలువ మొత్తం : 10,80,000/-
స్వాదీనం చేసుకున్న వాహనాల విలువ మొత్తం : 23,00,000/-
వాహనాలు నేరస్తుల వివరాలు
1)AP 23 W2369
Eicher
చకాని సాయి విక్రమ్ S/o శ్రీశైలం, వయస్సు: 20 సంవత్సరాలు, R/o చిన్నవెలికిచర్ల గ్రామం , కొందుర్గ్ (M) రంగారెడ్డి జిల్లా.
G.Prem kumar Goud S/o యాదియా గౌడ్, వయస్సు; 25 సంవత్సరాలు R/o చిన్నవెలికిచర్ల గ్రామం, కొందుర్గ్ (M) రంగారెడ్డి జిల్లా.
2).TS12 UC6818
Bharath Benz DCM
గుంబర్ బస్వరాజ్ S/o శంకర్, R/o హసిన్పూర్ (V) సిర్సి పంచాయతీ, బీదర్
3).AP24 TA3664
Tata Lorry
సూరేకరకు బాలయ్య S/o నర్సయ్య, R/o ఉమ్మంతలపల్లి (V) చినతపల్లి, నల్గొండ
డ్రైవర్ కమ్ ఓనర్
4).TS15UE0179
Bolero
సబావత్ జైరామ్ S/o చంద్రన్, R/o మాణిక్‌నాయక్ తండా, ముంగేపల్లి, కల్లేరు (M), సంగారెడ్డి జిల్లా.
డ్రైవర్ కమ్ ఓనర్
ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి డా.శ్రీ. రాజేష్ గారు, అల్లాదుర్గ సీఐ శ్రీమతి రేణుక గారు,యన్. ప్రణీత రెడ్డి డిప్యూటీ తాసీల్దార్ ( పౌ. స.)మెదక్ జిల్లా గారు,టాస్క్ఫోర్స్ సిఐ శ్రీ తిరుమలేష్ గారు,అల్లాదుర్గ్ ఎస్ఐ శ్రీ ప్రవీణ్ రెడ్డి గారు, జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది టి.దస్తయ్య, టి.నర్సిములు,
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, బి.రామాగౌడ్,
ఎం.శ్రీనివాస్,కె.భరత్ కుమార్ లు పాల్గొన్నారు.