జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
తేది -14.04.2024.
డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా ,స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలి… జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి 133వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ… భీంరావ్ రాంజీ అంబేడ్కర్ గారు, ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పిఅని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు. అంబేడ్కర్ గారి ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి శ్రీ.ఎస్.మహేందర్,మెదక్ డి.ఎస్.పి శ్రీ.రాజేశ్వర్ ,మెదక్ పట్టణ సి.ఐ.శ్రీ.దిలీప్ కుమార్ ,ఆర్.ఐ శ్రీ. నాగేశ్వర్ రావ్,మెదక్ రూరల్ ఎస్.ఐ.శ్రీ.అమర్,ఏ.ఆర్.ఎస్.ఐ శ్రీ.మహిపాల్ , జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.