Reporter -Silver Rajesh Medak.
Date-13/04/2024.
వాతావరణ సముతుల్యతతో ఆకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రక్షణ కల్పించాలి *
*కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే రవాణా చేయాలి *
మిల్లర్లు సిఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలి
- దాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్స్ ను ఆకస్మికంగా పరిశీలించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు *
వాతావరణ సమతుల్యతతో వర్షాభావ పరిస్థితి నేపద్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రక్షణ చర్యలు చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు
శనివారం రోజున అదనపు కలెక్టర్ రెవిన్యూ నార్సింగ్ పిఎ.సి.ఎస్, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రామాయంపేట మండలం కోనాపూర్ సాయి గీత, నాగేంద్ర రైస్ మిల్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్వాహకులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ వాతావరణ సమతుల్యత ఆకాల వర్షాలతో రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి తీసుకువస్తారని కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రవాణా చేయాలని నిల్వ ఉన్న ధాన్యానికి టార్పలిన్స్ తో రక్షణ కల్పించాలని, అకాల వర్షాలతో ధాన్యం తడవకూడదని చెప్పారు
కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేయడం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
అనంతరం రైస్ మిల్స్ ను పరిశీలించి సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలని మిల్లర్స్ వారికి ఇచ్చిన టార్గెట్ కనుగుణంగా బియ్యం లోడ్ చేసినవి రవాణా చేయాలని ,రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు,
రైస్ మిల్లర్స్ యజమాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.