చేవెళ్ళ:- సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కాంప్లెక్స్ చేవెళ్ల కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్ మాట్లాడుతూ… అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 ఆదివారం సెలవు దినం అవడంతో ఈ మేరకు ఆ మహనీయుడి జయంతిని ముందుగా జరుపుకుంటున్నామని తెలిపారు.అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను దాటుకుంటూ ఉన్నత విద్యను చదివి ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఎదిగారని తెలిపారు. భారతీయులకు రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులను కల్పించిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ జయంతిని ముందుగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బారాసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ సత్యానందం, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.