-ఎస్ఐ జి. నాగేంద్రప్రసాద్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 12, మహానంది:
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఓటర్లందరికి రక్షణగా తామున్నామని ధైర్యం ఇచ్చేందుకే పోలీసు కవాతునిర్వహిస్తున్నట్లు మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం మహానందిలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసు కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి,కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు. ఎన్నికలలో ఎవరికి వారు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొనే వాతావరణం కల్పిస్తామన్నారు. గొడవలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎలాంటి చట్టవిరుద్దమైన కార్యకలాపాలైనా తమ దృష్టికి వచ్చినట్లయితే, వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, గొడవలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.