Reporter -Silver Rajesh Medak.
Date–11/04/2024.
మహిళల విద్య అభివృద్ధి కోసం మరియు మహిళలకు సమాజంలో సమాన అవకాశాలు కొరకు జ్యోతిబాపూలే చేసిన కృషి నేటి సమాజానికి స్ఫూర్తి అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు.
గురువారం జిల్లా కలెక్టర్ సమావేశ హాలులో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలతో ఘనంగా నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 198 జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఆడపిల్లలు చదువుకోవాలి అనే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి మొదటిగా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి తద్వారా సమాజానికి విద్యను అందించిన స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిబాపూలే అని కొనియాడారు.
సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాల కోసం విశేష కృషి చేశారని సమాజంలో సమానత్వం, అందరూ విద్య నేర్చుకోవాలి మహాత్మా జ్యోతిబాపూలే నేటి సమాజానికి స్ఫూర్తి ప్రధాతగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. అటువంటి మహానీయుల త్యాగాల ఫలితమే ఇప్పుడు మన సమాజం అనుభవిస్తుందని అన్నారు. మన రాజ్యాంగంలో మహిళల రక్షణ వారి హక్కులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని వివరించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ గా రాకముందు వివిధ జిల్లాల్లో సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అనంతరం అదిలాబాద్ కలెక్టర్గా కూడా పని చేశానని మహిళ ఐఏఎస్ ఆఫీసర్లు వద్ద పనిచేసి మంచి అధికారిగా మారడానికి వారిచ్చిన సలహాలు సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. ఏ విధమైన కమ్యూనికేషన్ లేని సమయంలో సమ సమాజ స్థాపనకు మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలు ఆదర్శనీయమని అన్నారు.
కుల,వర్ణ, లింగ వ్యవస్థలకు మరియు సాంఘీక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు అని మరియు దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కొరకు జ్యోతిబా ఫూలే చేసిన కృషి ఎనలేనిది వివరించారు. అనంతరం వివిధ సంక్షేమ వసతి గృహాలలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను శాలువా ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి నాగరాజుగౌడ్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్, టీఎన్జీవోస్, జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, వసతి గృహ సంక్షేమ అధికారులు, బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.