Reporter -Silver Rajesh Medak.
Date-11/04/2024.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.
వేడుకలను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆధ్వర్యంలో మెదక్ ధ్యాన్చంద్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా గడ్డం కాశీనాథ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు గోవింద్ పూలే 1827 ఏప్రిల్ 11 మహారాష్ట్రలోని సతారా గ్రామంలో మాలి కుటుంబంలో గోవిందరావు చిన్నుబాయి దంపతులకు జన్మించారు అణగారిన బలహీన వర్గాలైన ఎందరో నిరుపేద బాల బాలికలకు పాఠశాలలను ఏర్పాటు చేయించి కుల వైశ్యామ్యాలను పక్కన పెట్టించి సమాజంలో స్త్రీ అనచివేతకు విద్యా జ్ఞానం సామాజిక స్పృహ లేకపోవడమే ప్రధాన కారణం అని గ్రహించిన జ్యోతిరావు పూలే లింగ వివక్షత తొలగించడానికి కృషి చేశారు ద రైట్స్ ఆఫ్ మాన్ అనే గ్రంథం వల్ల ప్రభావితుడైన పులే ప్రపంచాన్ని మార్చగల సాధనం విద్య ఒక్కటే అని పిలుపునిచ్చారు సమాజంలో రుగ్మతలు తొలగించడానికి ప్రజలు జ్ఞానవంతులుగా ఉండాలని మొదట బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి నుంచి అది ఆరంభం అవుతుందని జ్యోతిరావు పూలే అభిలాష పడ్డారు అనగారి నటువంటి వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేస్తున్న మహోన్నత ఆశయాన్ని 20వ శతాబ్దంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సైతం స్ఫూర్తి గా తీసుకొని వాటిని కొనసాగించారు సమ సమాజ నిర్మాణం జరగాలంటే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రం విద్యా జ్ఞానం సామాజిక స్పృహ కలగాలని మహాత్మ విశ్వసించారు మూఢనమ్మకాలను సామాజిక సమానత్వము దేవుని దృష్టిలో మనమందరము సమానమని మహాత్మా నమ్మేవారు బానిస సంకెళ్లను కుల వివక్షతను విమర్శిస్తూ మహాత్మ పూలే గారు రాసిన గులాం గిరి చర్నాకోల సేద్యగాడి లాంటి రచనల అధ్యయనం బడుగు బలహీన వర్గాల సమాజాన్ని చైతన్యపరచి వారి ఆలోచన విధానంలో వారి జీవనశైలిలో ఇప్పటికీ మనని ప్రభావితం చేస్తూ ఉండడం మహాత్మా గొప్పతనం తెలియజేస్తుందని గడ్డం కాశీనాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ 1888లో ముంబైకి చెందిన సామాజిక సంస్కర్త రావ్ బహదూర్ విఠల్రావు కృష్ణాజీ వన్డే కార్ లాంటి ఎందరో మహానుభావులు కలిసి మహాత్మా అనే బిరుదును జ్యోతిరావు పూలే గారికి ప్రధానం చేయడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి MLN రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, గోవింద్ రాజ్, ఆకుల రాము, విట్టలేస్ ,ప్రసాద్ మరియు చైతన్య తదితరులు పాల్గొన్నారు..