-దేశములో ఉన్న మేధావులు పెదవి విప్పాలి
-త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం
-రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చెయ్యడమే మన లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీమహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలి
-రాష్ట్రం లో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
-2022 వరకు దేశములో ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో బిజెపి చెప్పి మాట తప్పింది
-ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టించారో భాజపా నేతలు చెప్పాలి
-అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ లు అమలు చేశాం
-బిఆర్ఎస్ 10 యేండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు
-మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్
-మంగపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ రోజు మంగపేట మండలం లోని బోర్ నర్సాపూర్ గ్రామములో జరిగిన కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అల్లర్లు, ఘర్షణలు జరిగితే పాలకులు అణచివేసేవారని.. కానీ పాలకులుగా ఉన్నవారే ఘర్షణలకు కారణమవుతున్నారంటూ మణిపూర్ గుజరాత్ ఘటనల్ని ఉదహరించారు ఇది దేశ శ్రేయస్సుకు మంచిది కాదని బీజేపీకి దేశ ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. బీజేపీ పాలనలో.. దేశం తిరోగమనం బాట పట్టిందన్నారు.
రాహుల్ గాంధీ కావాలనుకుంటే యూపీఏ పదేళ్ల కాలంలోనే ప్రధానమంత్రి అయ్యేవారని, కానీ ఏనాడూ ఆయన పదవిని ప్రేమించలేదని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలను ప్రేమించడం, ప్రజలందరిని కలిపి ఉంచడమే రాహుల్ గాంధీ గారి లక్ష్యమన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటిలను పక్క అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేదలను గుర్తించి ఇల్లు రూ.5 లక్షల తో కట్టిస్తామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశామని, ఇంకా 4 గ్యారంటిలు త్వరలోనే అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క అన్నారు.
కెసిఆర్ 10 యేండ్ల పాలనలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బి ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజా సంక్షేమం కోసం పనే చేసే ప్రభుత్వం అని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నామని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,ఎన్నికల ఇంచార్జీలు కుచన రవళి రెడ్డి డాక్టర్ పులి అనీల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు