Reporter-Silver Rajesh Medak.
Date-10/04/2024.
మెదక్ బల్దీయా పై కాంగ్రెస్ జెండా…?
మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తో కౌన్సిలర్ ల చర్చ
బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతాం
మెదక్ బిఆర్ఎస్ కౌన్సిలర్ లు ఎమ్మెల్యేతో మాటామంతి
………………………………………………………….
మెదక్ మున్సిపల్ చైర్మెన్ పై అవిశ్వాస తీర్మాణానికి రంగం సిద్ధం అయ్యిందని, త్వరలోనే మెదక్ బల్దీయా పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ కౌన్సిలర్ లు నియోజక వర్గ ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంప్లలి రోహిత్ ఆహ్వానించారు.